ఖమ్మం టౌన్, వెలుగు : వినోభా నగర్ పేదలందరి ఇళ్లు వాళ్లకు దక్కాలి, లేదంటే మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు జరగనివ్వకుండా అడ్డుకుంటామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగు మట్ల వినోభా నగర్ కాలనీలో ఇండ్లు కోల్పోయిన, అంబేద్కర్ నగర్, టీటీడీసీ భవనాల్లో నిర్వాసితులుగా మిగిలిన బాధితులను ఆయన పరామర్శించారు.
భూదాన్ భూమిలో ధ్వంసమైన ఇండ్లను పరిశీలించారు. అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రజలకు ఏమి న్యాయం చేస్తారో తెల్వకుండా ఆయా పార్టీలకు చెందిన లీడర్లు వస్తూ పోతున్నారని తెలిపారు. గుడిసె వాసులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
