మా పెండింగ్ సమస్యలను పరిష్కరించండి..మంత్రి పొంగులేటికి రెవెన్యూ ఉద్యోగ సంఘాల వినతి

మా పెండింగ్ సమస్యలను పరిష్కరించండి..మంత్రి పొంగులేటికి రెవెన్యూ ఉద్యోగ సంఘాల వినతి

హైదరాబాద్, వెలుగు: తాము ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కారించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కోరాయి.  సోమవారం సీసీఎల్ఏను మంత్రి పొంగులేటి సందర్శించిన సందర్భంగా  డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. 

ఈ సందర్భంగా సీసీఎల్ఏ లోకేశ్ కుమార్, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి నేతృత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నేతలు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగుల పెండింగ్​సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లుగా మంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు.  

మంత్రిని కలిసిన వారిలో టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి,  టీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్ పాక, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ చౌహాన్, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.భిక్షం, కోశాధికారి మల్లేశ్ పాల్గొన్నారు.