
- బీఎస్ఎన్ఎల్కు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 5,992 సర్కారు స్కూళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ బీఎస్ఎన్ఎల్ అధికారులను కోరారు. ఈ మేరకు ఇటీవల బీఎస్ఎన్ఎల్ స్టేట్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)కు ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 5,342 బడులకు ఉచితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ అంగీకరించింది.
ఈ క్రమంలో మరిన్ని స్కూళ్లకు ఇవ్వాలని కోరగా, ఆ ఫైల్ పెండింగ్లో పడింది. దీంతో, గతంలో ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కనెక్షన్లు ముందుగా ఇవ్వాలని అధికారులు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్ఎల్ఎన్ఏఎక్స్ఎల్ అమలవుతున్న 5,992 బడుల్లోనైనా ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే లిస్టు పంపించడంతో వీటి ఏర్పాటులో ఏమైనా సమస్యలు వస్తే తమకు తెలపాలని కోరారు.