
న్యూఢిల్లీ: తెలంగాణ షూటర్ ఇషా సింగ్ ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఇషా సింగ్, ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మను భాకర్ సహా మొత్తం ఎనిమిది మంది ఇండియా షూటర్లు దోహాలో డిసెంబర్ 4 నుంచి 9 వరకు జరిగే ఈ టోర్నీకి క్వాలిఫై అయ్యారు.
భాకర్ విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్ విభాగాల్లో అర్హత సాధించగా, ఇషా సింగ్, సురుచి సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో బరిలోకి దిగుతారు. రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబూటా (మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), సిఫ్ట్ కౌర్ సమ్రా (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), విజయ్‌వీర్ సిద్ధు ( 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్), సిమ్రన్‌ప్రీత్ కౌర్ బ్రార్ (25 మీటర్ల పిస్టల్) కూడా క్వాలిఫై అయ్యారు.