రాహుల్ గాంధీతో తెలంగాణ స్పీకర్ భేటీ

రాహుల్ గాంధీతో తెలంగాణ స్పీకర్ భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​భేటీ అయ్యారు. శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆయన మధ్యాహ్నం 10 జన్ పథ్ లో రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. 20 నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పార్టీ సంస్థాగత జనరల్ సెక్రటరీ కేసీ వేణు గోపాల్‌తోనూ స్పీకర్ భేటీ అయ్యారు. లోధీ రోడ్‌లోని కేసీ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రాహుల్ తో దిగిన ఫొటోను స్పీకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.