ఖర్గేను కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్

ఖర్గేను కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించారు. ఆయన వెంట శేరిలింగపల్లి నియోజకవర్గ నేత మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. కాగా, త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో తనకు అవకాశం కల్పించాలని ఖర్గేను స్పీకర్ కోరినట్లు సమాచారం.