
హైదరాబాద్, వెలుగు: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెలాఖరుకు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాల్యువేషన్ ప్రక్రియ పూర్తికాగా, ఇంటర్నల్ రిజల్ట్ ప్రాసెస్ కూడా పూర్తయింది. దీంతో ఫలితాల వెల్లడి కోసం అధికారులు ప్రభుత్వాన్ని పర్మిషన్ కోరనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే రిజల్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.
మెమోలపై మార్కులతో పాటు డివిజన్స్ పెట్టాలా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాగా.. ఇప్పటికే ఏపీ ఫలితాలు రావడంతో తెలంగాణలోని పెరెంట్స్, స్టూడెంట్లలో రిజల్ట్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఈ నెల 4 వరకు టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించారు.