మెనూ ప్రకారం ఫుడ్ నాణ్యతతో ఇస్తున్నారా..?

మెనూ ప్రకారం ఫుడ్  నాణ్యతతో ఇస్తున్నారా..?
  •    గాంధీ ఆస్పత్రిలో రాష్ట్ర ఫుడ్​ కమిషన్​ తనిఖీలు

పద్మారావునగర్​, వెలుగు : గాంధీ ఆస్పత్రి లోని పేషెంట్లు, డ్యూటీ డాక్టర్లకు ఫుడ్​ అందించే  డైట్​క్యాంటీన్​ను రాష్ట్ర ఫుడ్​ కమిషన్​ సభ్యులు కె.గోవర్ధన్​ రెడ్డి, ఆనంద్, భారతి, శారద బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డుల్లో తిరుగుతూ  మెనూ ప్రకారం ఫుడ్​ ఇస్తున్నారా..? నాణ్యత ఎలా ఉందని అడిగి తెలుసుకోగా బాగుందని పేషెంట్లు చెప్పారు. గాంధీ ఆస్పత్రికి 90 శాతం పేద ప్రజలే ట్రీట్​మెంట్ కు వస్తారని, వారికి  నాణ్యమైన, పోషకాలతో కూడిన ఫుడ్ అందించాలని సూచించారు. 

సెల్లార్​ లోని క్యాంటీన్​ ను  కొత్తగా నిర్మిస్తున్న భవనంలోకి త్వరలో షిప్టు చేయనున్నట్లు సూపరింటెండెంట్​ ప్రొ.రాజారావు తెలిపారు. చీఫ్​ డైటీషీయన్​ రమేశ్​, డైట్​ క్యాంటీన్​ నిర్వాహకులు రవికుమార్​ ఉన్నారు.