ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు.. మార్చి 30 లాస్ట్ డే

ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు.. మార్చి 30  లాస్ట్ డే

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు పూర్తి కావడంతో ఇంటర్మీడియేట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 30వ తేదీని 2023-24 విద్యాసంవత్సరానికి చివరి రోజుగా పేర్కొంది. మార్చి 31 నుంచి మే 31 వరకు రాష్ట్రంలోని ఎయిడెడ్, ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించింది. మే 31 తర్వాతే కాలేజీలు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అడ్మిషన్లు కూడా బోర్డు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని తెలిపింది.  వేసవి సెలవుల్లో ఏ కళాశాల యాజమాన్యాలైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియేట్ విద్యా మండలి పేర్కొంది.