ఢిల్లీ బాటపట్టిన తెలంగాణ నేతలు

ఢిల్లీ బాటపట్టిన తెలంగాణ నేతలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు చెంది న కాంగ్రెస్, బీజేపీ నేతలు గత మూడు రోజు లుగా ఢిల్లీ బాట పడుతున్నారు. ఈ నెలాఖరుకు పీసీసీ చీఫ్ గా కొత్త వారిని నియమిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో ఈ పదవిని ఆశిస్తున్న పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ నేతలతో భేటీ అవుతున్నారు. తమ వంతు ప్రయత్నంగా లాబీయింగ్ చేసుకుంటున్నారు.

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఐదు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. కాగా, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా నియమితులైన బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్​ను అభినందించేందుకు వివిధ జిల్లాలకు చెందిన పార్టీ లీడర్లు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వెళ్తున్నారు. కిషన్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించనుండడంతో ఆశవహులు హస్తిన బాట పట్టారు.