జీతమిస్తలేరు అడుక్కతింటున్నం

జీతమిస్తలేరు అడుక్కతింటున్నం
  • కువైట్లో చిక్కుకున్న 27 మంది తెలంగాణోళ్ల గోస
  • నాలుగు నెలలుగా జీతాల్లేక ఇబ్బందులు
  • ఐదు రోజుల్నుం చి తిం డి పెడ్తలే రంటున్న కార్మికులు
  • రెండ్రోజుల నుం చి నీళ్లుకూడ ఇస్తలే రంటూ కన్నీళ్లు
  • ఇంటోళ్లకు ఫోన్ చేసుకుం ట ఏడుస్తు న్నరు
  • ఎట్లన్న ఇండియాకు తీసుకపొమ్మని బతిమాలుతున్నరు
  • ఆ కంపెనీ ల 75 మంది ఇండియా వాళ్లు

అమ్మా.. కువైట్ లో ఉండలేకపోతున్న. మంచి కంపెనీ అని చెప్పిఏజెంటు మోసం జేసిండు. వచ్చి ఐదు నెలలు అయితున్నా..ఒక్క నెల జీతమే ఇచ్చిండ్రు. నాలుగు నెల్ల నుంచి జీతం లేదు.ఏం లేదు. ఇంటికి పోతమంటె తిడుతున్నరు, కొడుతున్నరు,కేసులు పెడ్తమని బెదిరిస్తున్నారు. అన్నం తిని ఐదురోజులైతుంది. రెండ్రోజుల నుంచి నీళ్లు కూడ ఇస్తలేరు. కంపెనీవాళ్లకు తెల్వకుంట దగ్గర ఉన్న మసీదులకు పొయి అడుక్కునితింటున్నం . ఎట్లన్న నన్ను ఇంటికి తీసుకపొండ్రి.– కువైట్​కు వలస వెళ్లిన కార్మి కుడు లతీఫ్ గోస ఇది

నా బిడ్డను ఎట్లన్న కాపాడండి

కువైట్ నుంచి ఫోన్ చేసి తన బిడ్డ చెప్పిన బాధలువిని లతీఫ్ తల్లి జహెదా బేగం అల్లాడిపోతున్నది.వాళ్లది జగిత్యాల జిల్లా మెట్ పల్లి. ఊర్లో పనిలేకఅప్పులు చేసి దేశం పంపినమని ఏడుస్తున్నది.వాళ్లను వీళ్లను కల్సుకుంట, కనబడ్డోళ్లనుబతిమిలాడుతున్నది. ఎవరు సాయం జేస్తరాఅనుకుం ట ఆమె దేవులాడుతుంటెచూసినోళ్లం దరు కంట్ల నీళ్లు పెట్టు కుంటున్నరు.

లతీఫ్​ ఒక్కడే కాదు.. ఆ కంపెనీల పనిచేసేందుకు పొయిన 27 మంది తెలంగాణోళ్లు ఇట్లనే ఆగమైపోయిండ్రు. ఏదో సంపాదించుకుంటమని గల్ఫ్ కు వస్తె..మా బతుకులు ఇట్లయి నయనుకుంట కంట్ల నీళ్లు పెట్టుకుంటున్నరు

జగిత్యాల, వెలుగు: ఉన్న ఊళ్ల పని లేదు.. దేశం పోతె ఏమన్న సంపాదించుకోవచ్చన్న ఆశ.. ఇంటికాడ పెళ్లాం , పిల్లలకు కడుపు నిండా తిండి దొరుకుతుందన్న తపన.. నాలుగైదేండ్లు పొయి వస్తె నాలుగు పైసలు మిగులుతయన్న ఆలోచన.. తెలంగాణ నుంచి వేలాది మంది ఏటా దేశం కాని దేశం పోతున్నరు.వారిలో చాలా మంది ఏజెంట్ల చేతిలో మోసపోయి, గల్ఫ్ లో సరైన పని దొరకక, దొరికినా అక్కడ బతకలేక యాతన పడుతున్నరు. తిరిగి వచ్చేద్దామంటె.. ఊర్లో చేసిన అప్పులు గుర్తుకొచ్చి ఆగిపోయేటోళ్లు  కొందరు. పోదామన్నా కంపెనీలు పోనీయక బాధపడుతున్నోళ్లు మరి కొం దరు. ఇట్లనే కువైట్  వెళ్లిన 27 మంది తెలంగాణ కార్మికులు అష్టకష్టాలు పడుతున్నరు. నాలుగైదు నెలల నుంచి జీతాలియ్యక, ఇదేందని అడిగితే..తిండి పెట్టకుండ కంపెనీ హింస పెడుతుండటంతో అల్లాడి పోతున్నరు.

రూ. 85 వేల చొప్పున వసూలు చేసి..

సికింద్రాబాద్ కు చెందిన ఓ కన్సల్టెన్సీ కంపెనీ కువైట్ లోని ఎనాస్కో పెట్రోలియం కంపెనీల ఉద్యోగాలిప్పిస్తామని చెప్పిం ది. వీసా కోసం ఒక్కొక్కరి నుంచి రూ.85 వేలు వసూలు చేసిం ది. కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల నుంచి 27 మంది అప్లై చేసుకున్నరు. కన్సల్టెన్సీ కంపెనీ వీళ్లందరినీ 2018 డిసెంబర్ లో కువైట్ విమానం ఎక్కించింది.ఆ కంపెనీల ఉన్న మొత్తం 200 మందిలో 75 మంది ఇండియా వాళ్లే, ఇందులో 27 మంది తెలంగాణ వాళ్లే.కంపెనీ వీళ్లందరికి మొదటి నెల జీతం మంచిగనే ఇచ్చింది. తర్వాత నాలుగు నెలల నుంచి జీతాలిస్తలేదు. సరే ఇస్తరు కదా అని చూసుకుంటనే వచ్చిన కార్మి కులు.. వారం కింద ఇదేందని నిలదీశారు. ఇట్ల ఎదురించినో ళ్లకు కంపెనీ ఐదు రోజుల నుంచి తిండిపెడ్తలేదు. ఒకటి రెం డు రోజులు ఎట్లనో గడిచిం ది.తిండి పెడ్తలేరేందని అడిగితె.. రెండు రోజుల నుంచి మంచి నీళ్లు కూడా ఇవ్వకుండ సతాయించుడు మొదలుపెట్టారు. పోనీ ఇండియాకు పోతమని చెప్తె.. కార్మికులకు పాస్ పోర్టులు ఇవ్వట్లే దు. మీదికెళ్లి దొంగతనం చేశారని పోలీసు కేసులు పెడ్తమని బెదిరిస్తున్నారు. అక్కడ ఉండ లేక, తిరిగి పోలేక కార్మికులు కన్నీళ్లు పెట్టుకుంటు న్నరు. ఆకలికి తట్టుకోలేక కంపెనీ వాళ్లకు తెలియకుం డా బయటికి వెళ్తున్నమని, మసీదుల దగ్గరికి పొయి అడుక్కొని కడుపు నింపుకుంటు న్నామని బాధతోటి చెప్తున్నరు.

బయటపడని బాధితులెందరో..

రాష్ట్రం నుంచి వలస వెళుతున్నవారిలో వందలాది మంది ఇట్లాంటి బాధలు పడుతున్నారు. కానీ ఒకటీ అరా ఘటనలు మాత్రమే బయటికి వస్తున్నాయి.మిగతా వారంతా ఇబ్బం దులు పడుతూనే ఉన్నారు.ఇంత జరుగుతున్నా ప్రభుత్వం , అధికారులు పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గల్ఫ్ ఏజెంట్ల మోసాలపై ఏదో అరకొర చర్యలు తప్ప.. మొత్తంగా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదేమని ప్రశ్నిస్తున్నాయి.

ఇంకా ఎందరో..

2018లో నవంబర్ లో సౌదీలోని జేఅండ్ పీకంపెనీ చేసిన మోసంతో ఇండియాకు చెందిన ఐదు వేల మంది రోడ్డు పాలయ్యారు. అందులో తెలంగాణకు చెందినవారు 600 మంది వరకు ఉన్నారు. ఉపాధి కోల్పోయిన వారికి అకామా ఇవ్వకుం డా కంపెనీ ఇబ్బందులకు గురిచేసిం ది. మీడియాలో వరుస కథనాలు రావడంతో చివరికి ఇండియన్ ఎంబసీ అధికారులు స్పందించి సౌదీ ప్రభుత్వంతో మాట్లాడారు. విడతల వారీగా స్వదేశానికి పంపించా రు.

ఈ ఏడాది ఏప్రిల్ లో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి  చెందిన మక్తపల్లి వీరయ్య..కరీం నగర్ కు చెందిన ఓ ఏజెంట్ ద్వారా దుబాయ్​ వెళ్లాడు. ఆయనకు క్లీనింగ్​ వర్క్​ అని మొదట చెప్పినా .. దుబాయ్​లో యజమానులు ఎడారి లో ఒంటెలు కాసే పనిలో పెట్టారు. ఒంటెలను కడగాలని, పాలు పిండాలని చెప్పారు. ఓ రోజు ఒక ఒంటె తప్పి పోయిందంటూ పళ్లు ఊడేలా కొట్టారు. అతను సోషల్ మీడియా ద్వారా గోడు వెళ్లబోసుకున్నాడు.

గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట కు చెందిన సమీర్‍.. ఓ ఏజెంట్‍ ద్వారా దుబాయ్​ వెళ్లాడు. రూ. 80 వేలు తీసుకున్న ఆ ఏజెంట్.. దుబాయ్​లోని ఓ ఫంక్షన్​ హాల్ లో పనిచేయాలని చెప్పాడు. కానీ అక్కడి ఎయిర్ పోర్టులో దిగగానే.. నేరుగా ఎడారికి తీసుకెళ్లారు. గొర్రెలు కాసే పని చేయాలని చెప్పారు. మోసపోయానని తెలుకున్న సమీర్.. అక్కడి వారిని బతిమాలినా కూడా బాగా కొట్టారు. సోషల్ మీడియాలో సమీర్ తన ఆవేదనను వ్యక్తంచేయడంతో.. ప్రభుత్వం స్పందించి , స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నం చేసిం ది.

స్వదేశానికి తీసుకువెళ్లండి

నాలుగు నెలలుగా జీతం లేదు. తెచ్చిన అప్పులు కట్టకపోవడంతోఊర్లో ఇబ్బందులు ఎదురవుతున్నయి. ప్రభుత్వం ఆదుకోవాలె.మమ్మల్ని దేశానికి తెప్పించుకుని.. మమ్మల్ని బాధ పెడుతున్నకంపె నీ మీద చర్యలు తీసుకోవాలె.- ప్రశాం త్, నిజామాబాద్ జిల్లా వాసి

ప్రభుత్వం ఆదుకోవాలె

ఏజెంటు చేతిలో మోసపోయి అప్పులపాలైనం. కువైట్ లో నాఅన్నోళ్లు లేకబాధపడుతున్నం . మా గురించి తెలిసి ఊర్లోమావోళ్లం తా ఆందోళన పడుతున్నారు.మమ్మల్ని తొందరగ ఇండియాకుతీసుకెళ్లాలె. ప్రభుత్వం ఆదుకోవాలె.- కోలకాని అజయ్,జగిత్యాల జిల్లా మల్యాల

ఎంబసీ స్పందిం చాలె.పొట్టకూటి కోసం కువైట్ కు వచ్చినం.వచ్చినప్పుడు మాకు కంపె నీ మోసం తెల్వదు.ఇప్పుడు కష్టాలు పడుతున్నం. దొంగకంపె నీలను వెంటనే మూసెయ్యాలె. ఎంబసీఅధికారులు తెలుసుకొని మాకు సాయంచెయ్యాలె. ఇంటికి తిరిగి పంపాలె.- నరేష్, జగిత్యాల జిల్లా కొండగట్టు