
- వివరాలు సేకరించిన టీఎస్ ఆర్టీసీ అధికారులు
- విజయవాడ జోనల్ వర్క్‌షాప్‌లో కార్మికులతో భేటీ
- ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామన్న యూనియన్ లీడర్లు
- విజయవాడకు టీఎంయూ లీడర్లు
ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి, కమలాకర్ గౌడ్, యాదయ్యతో పాటు పలువురు నేతలు బుధవారం సూర్యాపేట, కోదాడ డిపోల్లోని ఆర్టీసీ కార్మికులను కలిశారు. తర్వాత విజయవాడ వెళ్లారు. గురువారం ఆర్టీసీ అధికారులను, కార్మికులను కలుస్తామని థామస్ రెడ్డి తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ విలీనం టైమ్‌లో ఏర్పడిన ఇబ్బందులు తెలంగాణలో రిపీట్ కాకుండా అధికారులను కలిసి సమాచారం తీసుకుంటామన్నారు. ఇంతకాలం ఉద్యోగ భద్రత లేకుండా కార్మికులు పని చేశారని, విలీనం తర్వాత జీతాలు పెరుగుతాయని తెలిపారు.