కృష్ణా రివర్ స్విమ్మింగ్ చాంపియన్‌‌‌‌లో..సాజిదాకు బ్రాంజ్

కృష్ణా రివర్ స్విమ్మింగ్ చాంపియన్‌‌‌‌లో..సాజిదాకు బ్రాంజ్

హైదరాబాద్, వెలుగు : కృష్ణా రివర్ స్విమ్మింగ్ చాంపియన్‌‌‌‌లో తెలంగాణ స్విమ్మర్‌‌‌‌‌‌‌‌  షేక్ సాజిదా సత్తా చాటింది. ఆదివారం విజయవాడలోని దుర్గా ఘాట్‌‌‌‌ నుంచి ఫుట్ సిటీ వరకూ 1.25 కిలోమీటర్ల మేర సాగిన ఈ పోటీలో సాజిదా బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ సాధించింది. హైదరాబాద్‌‌‌‌లోని జియాన్‌‌‌‌ స్విమ్మింగ్ అకాడమీకి చెందిన సాజిదా 32.52.35 టైమింగ్‌‌‌‌తో మూడో స్థానంతో రేసును పూర్తి చేసింది.