- 2030 నాటికి గ్లోబల్ టాప్ 5లో నిలపాలని సర్కార్ లక్ష్యం
- దావోస్‌లో ‘నెక్స్ట్‌జెన్ లైఫ్‌సైన్సెస్ పాలసీ’ ఆవిష్కరణ
- ఐదేండ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పన..
- 2,600 కోట్ల డాలర్ల పెట్టుబడులు టార్గెట్
- గ్రీన్ ఫార్మా సిటీ, ఓఆర్ఆర్ వెంట 10 ఫార్మా విలేజ్‌ల నిర్మాణం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ లైఫ్‌సైన్సెస్ రంగాన్ని ప్రపంచంలోనే అత్యున్నతంగా నిలబెడతామని ప్రభుత్వం వెల్లడించింది. 2030 నాటికి ప్రపంచంలో టాప్5 లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా తెలంగాణను నిలపాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ ఐదేండ్ల కాలంలో 5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు 2,600 కోట్ల డాలర్ల పెట్టుబడులను సమీకరించాలని భావిస్తోంది. అందులో భాగంగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, పర్యావరణహితమైన మాన్యుఫ్యాక్చరింగ్, థెరప్యుటిక్స్ను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది.
ఈ మేరకు దావోస్ సదస్సులో ‘తెలంగాణ నెక్స్ట్‌జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30’ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. అత్యున్నత ఆర్అండ్ సెంటర్ల ఏర్పాటుతో మాన్యుఫ్యాక్చరింగ్‌కు మరింత బూస్ట్వస్తున్నదని పాలసీ డాక్యుమెంట్లో ప్రభుత్వం పేర్కొంది. ఆమ్జెన్, సనోఫీ, బ్రిస్టల్ మయర్స్స్క్విబ్, లిల్లీ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఆర్ అండ్ డీ, డిజిటల్జీసీసీలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయని తెలిపింది.
ప్రపంచ సప్లై చెయిన్స్‌కు ఎగమతులు చేయడమే కాకుండా.. ఇప్పుడు ప్రపంచ స్థాయి ఉత్పత్తి కేంద్రంగానూ తెలంగాణ ఎదిగిందని డాక్యుమెంట్లో వివరించింది. పర్యావరణానికి నష్టం చేయకుండా చూడడంతో పాటు అవసరమైన ఔషధాల తయారీకి గ్రీన్ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నట్టు పాలసీ డాక్యుమెంట్లో ప్రభుత్వం పేర్కొంది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పది ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయనుంది. జీనోమ్‌వ్యాలీని మరింత విస్తరించనుంది. మెడికల్ డివైజెస్పార్క్ను పటిష్టం చేయనుంది.
వివిధ అంశాలపై ఫోకస్..
ఆర్ అండ్ డీ, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్:బయోలాజిక్స్, బయోసిమిలర్స్, సెల్జీన్ థెరపీ, ఎంఆర్‌ఎన్‌ఏ, క్రిస్పర్ టెక్నాలజీ, యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్, పెప్టైడ్స్, ఒలిగో న్యూక్లియోటైడ్స్, ప్రెసిషన్ఫెర్మెంటేషన్ వంటి అత్యాధునిక చికిత్స విధానాల కోసం ఆర్అండ్ డీ సెంటర్లు, మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటు.
క్లినికల్ట్రయల్ సిస్టమ్బలోపేతం: ట్రయల్స్‌కు వేగంగా అనుమతులు. వ్యాధికి తగ్గట్టుగా క్లినికల్ట్రయల్ రిజిస్ట్రీల ఏర్పాటు. క్లినికల్ఇన్నోవేషన్శాండ్బాక్స్లాంటి కార్యక్రమాల నిర్వహణ.
ఫార్మా సర్వీసుల విస్తరణ: ఇందులో భాగంగా కాంట్రాక్ట్ రీసెర్చ్ఆర్గనైజేషన్స్ (సీఆర్వో), కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్(సీడీఎంవో)ల ఏర్పాటు. వీటి ద్వారా ప్రస్తుతం 200 కోట్ల డాలర్లుగా ఉన్న ఫార్మా మార్కెట్విలువను వెయ్యి కోట్ల డాలర్లకు పెంచేలా కసరత్తు.
డయాగ్నస్టిక్స్ అండ్ మెడికల్ ఎలక్ట్రానిక్స్: డయాగ్నస్టిక్స్, మెడికల్ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్, డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు.
గ్లోబల్వాల్యూ సెంటర్స్/గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్స్: అడ్వాన్సుడ్ అనలిటిక్స్, ఏఐ, ఇంజనీరింగ్, డిజిటల్ హెల్త్, హై ఎండ్ ఆర్ అండ్‌డీ కోసం జీసీసీలు, జీవీసీల ఏర్పాటుకు ప్రోత్సాహం.
కచ్చితమైన/పర్సనలైజ్డ్ థెరపీస్: క్లినికల్ రిజిస్ట్రీలను ఏర్పాటు చేయడం ద్వారా ఏ వ్యక్తికి తగ్గట్టుగా ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇచ్చేలా పర్సనలైజ్డ్ థెరపీలఅభివృద్ధి. అందుకు అనుగుణంగా అత్యంత భద్రంగా ఉండేలా డిజిటల్ హెల్త్ రికార్డులకు రూపకల్పన.
గ్లోబల్హబ్గా తీర్చిదిద్దడంలో భాగంగా అత్యాధునిక సౌలతులు కల్పిస్తామని పాలసీ డాక్యుమెంట్లో ప్రభుత్వం పేర్కొంది. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యర్థాలు వచ్చేలా గ్రీన్ ఫార్మాసిటీ నిర్మించనుంది. సెంట్రలైజ్డ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్‌ను వాడుకుంటూ కాలుష్యరహితంగా దానిని తీర్చిదిద్దనుంది.
ఔటర్ రింగ్‌రోడ్ వెంట ఒక్కోటి వెయ్యి నుంచి 3 వేల ఎకరాల విస్తీర్ణంలో పది ఫార్మా విలేజీల అభివృద్ధి. తద్వారా రాష్ట్రమంతటా డీసెంట్రలైజ్డ్, సమతుల్యమైన పారిశ్రామిక అభివృద్ధి.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో బయో ఇన్నోవేషన్, బయో మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేసి జీనోమ్ వ్యాలీ విస్తరణ. స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం.
లైఫ్ సైన్సెస్ సంస్థల్లో టాలెంట్ఉన్న యువతను నియమించుకునేలా వారిని తయారు చేసుకునేందుకు వీలుగా తెలంగాణ స్కూల్ఆఫ్లైఫ్ సైన్సెస్ఏర్పాటు. ఇతర కేపబిలిటీ బిల్డింగ్ప్లాట్ఫామ్ల ఏర్పాటు. బయో ఇన్ఫర్మాటిక్స్, హెల్త్ఔట్కమ్స్అండ్ ఎకనామిక్ రీసెర్చ్, ఏఐ వంటి సర్టిఫికేషన్ కార్యక్రామలపై విద్యార్థులకు శిక్షణ.
