- యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ బెంగాల్ రాష్ట్రాలకు అత్యధిక వాటా
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు రూ.33,180.78 (2.174 శాతం) కోట్లు రానున్నాయి. అందులో కార్పొరేషన్ పన్ను రూ.9,740.28 కోట్లు, ఆదాయపు పన్ను రూ.11,808.15 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.9,074.92 కోట్లు, కస్టమ్స్ రూ.1,770.30 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ.754.15 కోట్లు, ఇతర పన్నులు, డ్యూటీస్ రూ.32.98 కోట్లు రాష్ట్రానికి రానున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. ఇదే సందర్భంలో.. ఏపీకి రూ.64,362.16 (4.217 శాతం) కోట్లు కేంద్ర పన్నుల్లో వాటా రానుంది.
అందులో కార్పొరేషన్ పన్ను రూ.18,893.64 కోట్లు, ఆదాయపు పన్ను రూ.22,904.77 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.17,603.01 కోట్లు, కస్టమ్స్ రూ.3,433.92 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ.1,462.85 కోట్లు, ఇతర పన్నులు, డ్యూటీస్ రూ.63.97 కోట్లు రాష్ట్రానికి రానున్నాయి. కేంద్ర పన్నుల్లో యూపీ రూ.2,68,910.76 కోట్లు (17.619 శాతం), బిహార్ (రూ.1,51,831.80 కోట్లు (9.948 శాతం), మధ్యప్రదేశ్ రూ.1,12,133.93 కోట్లు (7.347 శాతం), బెంగాల్ రూ.1,10,119.27 కోట్లు (7.215 శాతం), మహారాష్ట్ర రూ.98,306.06 కోట్లు (6.441 శాతం), రాజస్తాన్ రూ. 90,445.85 కోట్లు (5.926 శాతం) రాష్ట్రాలకు అత్యధిక వాటా వెళ్తున్నట్లు కేంద్ర బడ్జెట్ లెక్కలు చూపుతున్నాయి.
