దేశంలో ఆహార కల్తీలో తెలంగాణ టాప్‌ : బీజేపీ ఎమ్మెల్సీ అంజి రెడ్డి

దేశంలో ఆహార కల్తీలో తెలంగాణ టాప్‌ : బీజేపీ ఎమ్మెల్సీ అంజి రెడ్డి
  •     బీజేపీ ఎమ్మెల్సీ అంజి రెడ్డి

హైదరాబాద్, వెలుగు: దేశంలో ఆహార కల్తీలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం సిగ్గుచేటని బీజేపీ ఎమ్మెల్సీ అంజి రెడ్డి అన్నారు. రాష్ట్రం రైజింగ్ తెలంగాణ కాదు.. అనారోగ్య తెలంగాణగా మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు పెంచుతామన్న గత, ప్రస్తుత ప్రభుత్వాలు పెంచలేదని మండిపడ్డారు. 

రాష్ట్రవ్యాప్తంగా 500 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను నియమిస్తామని ఇంతవరకు ఒక్కరినీ నియమించలేదని ఆరోపించారు. పాతబస్తీ వేదికగా ఫుడ్ జిహాదీలు తయారయ్యారని పేర్కొన్నారు. ఇలాగే కల్తీ కొనసాగితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా, టూరిస్టుల రాక కూడా తగ్గిపోతుందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.