- పెద్దలకు రూ.2100, పిల్లలకు రూ.1800
- ఏసీ బస్సులో జర్నీ, ఎంట్రీ టికెట్లు, టీ, భోజనం అన్నీ వాళ్లవే
హైదరాబాద్‌సిటీ, వెలుగు : జంటనగరాల ప్రజల కోసం తెలంగాణ టూరిజం సరికొత్త వీకెండ్ ప్యాకేజీని ప్రకటించింది. చిలుకూరు బాలాజీ టెంపుల్, ఎక్స్‌పీరియం ఎకో పార్క్, కొత్వాల్‌గూడ ఎకో టూరిజం పార్క్ లను ఓకే రోజులో విజిట్చేసేలా వీకెండ్ప్యాకేజీ టూర్‌ను ప్లాన్ చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం ఈ టూర్ఉండనున్నది.
షెడ్యూల్ ఇలా....
ఉదయం 7 గంటలకు మినీ ఏసీ బస్సులో సికింద్రాబాద్ యాత్రి నివాస్ నుంచి 7.15 గంటలకు స్టార్టవుతారు. తర్వాత బేగంపేట్‌లోని పర్యాటక భవన్ కు వచ్చి అక్కడి నుంచి బయలుదేరి7:30 కు బషీర్‌బాగ్‌లోని చీఫ్రిజర్వేషన్ఆఫీసు ప్రాంతానికి చేరుకుంటారు. తర్వాత 8 గంటలకు తారామతి బారాదరికి చేరుకుంటారు. టిఫిన్చేశాక 9గంటలకు చిలుకూరు టెంపుల్దర్శనం ఉంటుంది. 11:30 గంటలకు ఎక్స్‌పీరియం ఎకో పార్క్ వెళ్తారు. 2 గంటలకు శాఖాహార భోజనం తర్వాత 3:30 గంటలకు కొత్వాల్‌గూడ ఎకో టూరిజం పార్క్ సందర్శన ఉంటుంది. 5:30 గంటలకు హై-టీ ఇస్తారు. 7 గంటలకు బయలు దేరి బషీర్‌బాగ్‌లోని సీఆర్ఓకి చేరుకుంటుంది.
అన్నీ కలిపి రూ.2100..
టిఫిన్, వెజ్మీల్స్, హై-టీ, అన్ని ప్రదేశాల ప్రవేశ టిక్కెట్లు, టోల్, పార్కింగ్ చార్జీలు, టూర్ గైడ్ సేవలు అన్నీ కలుపుకుని పెద్దలకు ఒక్కొక్కరికి 2,100, -పిల్లలకు ఒక్కొక్కరికి1,800 చార్జీలుగా నిర్ణయించారు. బుకింగ్‌లు, మరిన్ని వివరాలకు టూరిజం బుకింగ్ ఆఫీస్‌ను 9848126947, 9848125720, 9848306435 నంబర్లలో సంప్రదించవచ్చు.
