ట్యాంక్‌బండ్, వెలుగు: పరిపాలన సౌలభ్యం కోసం మూడు జోన్లుగా విభజించనున్న నేపథ్యంలో జలమండలిలో ఫీల్డ్ సిబ్బందిపై పనిభారం పెరుగుతుందని, అందుకు అనుగుణంగా కొత్త పోస్టులు మంజూరు చేయాలని తెలంగాణ జలమండలి ఉద్యోగుల యూనియన్ డిమాండ్ చేసింది. మంగళవారం యూనియన్ ప్రతినిధులు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కె.అశోక్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం యూనియన్ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగుల గ్రాట్యుటీ, కుటుంబ పింఛన్, కారుణ్య నియామకాల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు రాఘవేంద్ర రాజ్, అల్లి శ్రావణ్ కుమార్, ఎం.రాజా, కె.ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
