తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

తెలంగాణకు మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.   ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం  రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారె అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో   తెలంగాణలో  సెప్టెంబర్ 1  నుంచి మరో రెండు రోజులపాటు  వర్షాలు కురిసే అవకాశం వెల్లడించింది.  .

సెప్టెంబర్ 1 న భారీ నుంచి అతి భారీ వర్షాలు

 ఆరెంజ్ అలర్ట్స్:   పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

ఎల్లో అలర్ట్స్: ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

సెప్టెంబర్ 2న  పు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో  ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ.