కేటీఆర్కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు

 కేటీఆర్కు  తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు

మహిళలపై  బీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 24న కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

కేటీఆర్ ఏమన్నారంటే.?

‘‘బస్సులో అల్లం,  ఎల్లిపాయలు ఒలిస్తే తప్పా అని మంత్రి సీతక్క అడుగుతున్నరు. తప్పని మేం ఎక్కడన్నం అక్క. మేం అన్లేదు. కాకపోతే  దానికోసమే బస్సు పెట్టిర్రని మాకు తెల్వక మేం ఇన్నిరోజులు మామూలుగా బస్సులు నడిపినం. మాకేమో తెల్వకపాయే. మీరు అప్పుడే చెబితే బాగుండు. బస్సుల సంఖ్య పెంచు. మనిషికో బస్సు పెట్టు. కుటుంబాలకు కుటుంబాలు పోయి అందులో కుట్లు, అల్లికలు చేసుకుంటరు. అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు, ఇంకేమేం చేసుకుంటారో చేసుకోనియండి. మేమెందుకు వద్దంటం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు

 కేటీఆర్ క్షమాపణ

 కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో ట్విట్టర్ వేదికగా సారీ చెప్పారు. ‘‘నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను  విచారం వ్యక్తం చేస్తున్నాను.. నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’’ అని కేటీఆర్ పోస్ట్ చేశారు.