ఇరాన్ క్షిపణి దాడిలో పోతిరెడ్డిపల్లె వాసికి గాయాలు

ఇరాన్ క్షిపణి దాడిలో పోతిరెడ్డిపల్లె వాసికి గాయాలు
  • అబుదాబి ఎయిర్​పోర్ట్​లో ఘటన 

ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఇరాన్​ క్షిపణి​దాడిలో​ రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లెకు చెందిన నందెల్లి రాజేశ్వర్ రావు గాయపడ్డాడు. ఈ ఘటన అబుదాబి ఎయిర్​పోర్ట్​లో చోటుచేసు
కుంది. బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశ్వర్ రావు నాలుగేండ్ల కింద అబుదాబి వెళ్లాడు. అక్కడి ఎయిర్​పోర్ట్​లో క్లీనింగ్ సెక్షన్​లో విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పట్లాగే ఆదివారం 
పనిచేస్తుండగా.. ఇరాన్ జరిపిన మిసైల్​ దాడిలో ఎయిర్​పోర్ట్​అద్దాలు పగిలి, గాజు పెంకులు రాజేశ్వరరావు చేతికి, చాతి భాగంలో గుచ్చుకోవడంతో గాయపడ్డాడు. ఎయిర్​పోర్ట్​ సిబ్బంది అతడిని వెంటనే హాస్పిటల్​కు తరలించారు. చికిత్స అనంతరం తన గదికి పంపించారని బాధితుడు తన సోదరుడు రామారావుకు వాట్సాప్​లో మెస్సేజ్ పెట్టాడు.

అలాగే, దాడి ఘటనలో ఎయిర్​పోర్ట్​ సమీపంలో ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్​కు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందినట్లు సమాచారం ఇచ్చాడు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్​దాడుల నేపథ్యంలో ఫ్లైట్లు నిలిచిపోయాయని, రెండు, మూడు రోజుల్లో రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపాడు.  రాజేశ్వర్​రావు గాయపడ్డాడని తెలుసుకున్న అతని భార్య మీనా ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, రాజేశ్వర్​ రావును స్వగ్రామం రప్పించేందుకు చొరవ తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరారు.