హైదరాబాద్, వెలుగు: తెలంగాణ యువ చెస్ ప్లేయర్ ఉప్పల ప్రణీత్ రెండో గ్రాండ్‌మాస్టర్ నార్మ్ సొంతం చేసుకున్నాడు. స్విట్జర్లాండ్‌లో శుక్రవారం ముగిసిన బీల్ చెస్ ఫెస్టివల్లో పోటీ పడ్డ ప్రణీత్ 9 రౌండ్లకు గాను ఆరు పాయింట్లు నెగ్గాడు. దాంతో, 21 ఎలో రేటింగ్ పాయింట్లతో పాటు జీఎం నార్మ్ అందుకున్నాడు. ప్రస్తుతం 2478 రేటింగ్ పాయింట్లతో నిలిచాడు. రేటింగ్‌ను 2500కి పెంచుకోవడంతో పాటు మూడో నార్మ్ అందుకుంటే అతను గ్రాండ్‌మాస్టర్ హోదా సాధిస్తాడు.
