
తెలంగాణ షార్ట్‌ఫిల్మ్‌కు జాతీయ అవార్డు దక్కింది. వెస్ట్బెంగాల్రాజధాని కోల్‌కతాలో ఈ నెల 8 నుంచి 15 వరకు జరిగిన కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘సమ్మర్రాప్సోడి’ బెస్ట్షార్ట్ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకుంది. గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ పురస్కారం, రూ.5 లక్షల నగదు బహుమతిని డైరెక్టర్కటికనేని శ్రావణ్ వెస్ట్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. 20 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్‌ఫిల్మ్‌లో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరుకు చెందిన చిన్నారి పూర్ణబోధ నటించాడు.