వేతనాల పెంపుకు సినీ కార్మికుల సమ్మె

వేతనాల పెంపుకు సినీ కార్మికుల సమ్మె

తెలుగు చిత్ర పరిశ్రమలో గతకొన్ని ఏళ్లుగా సినీ కార్మికుల వేతనాలు పెంచపోవడంతో కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ఈ నేపథ్యంలో వారు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేతనాలు పెంచే వరకు షూటింగ్ కు హాజరు రాకూడదని నిర్చయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే వేతనాలు పెంచే విషయమై సినీ కార్మికుల ఫెడరేషన్ పై వత్తిడి తేనున్నారు. ఈ క్రమంలో 24 యూనియన్ సభ్యులు ఈ నెల 22న ఫెడరేషన్ ముట్టడి చేయుచున్నారు. వేతనాలు పెంచే వరకు షూటింగ్ లు జరగవని సినీ కార్మికులు అంటున్నారు.