
అమరావతి : ప్రముఖ రచయిత లల్లా (82) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో 2025, అక్టోబర్ 3వ తేదీ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు పరుచూరి నారాయణాచార్యులు. లల్లా దేవి పేరుతో రచనలు చేశారు. 150కి పైగా కథలు, నవలలు, నాటకాలు రచించి గొప్ప రచయితల్లో ఒకరిగా పేరు పొందారు. ఆయన రాసిన వాటిల్లో ఆమ్రపాలి, మహామంత్రి తిమ్మరుసు వంటి నవలలు బాగా ప్రాచుర్యం పొందాయి.
నారాయణాచార్యులు స్వగ్రామం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీపంలోని నిమ్మగడ్డవారిపాలెంలో అంత్య క్రియలు నిర్వహించనున్నారు. 2004లో అప్పటి నటి సౌందర్య హీరోయిన్ గా వచ్చిన 'శ్వేతనాగు' సినిమాకు లల్లాదేవి కథను అందించారు. మాజీ సీఎం, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు నటించిన సామ్రాట్ అశోక్ సినిమా కూడా లల్లాదేవి నవల ఆధారంగా తెరకెక్కిందే.