రాష్ట్రంలో దడ పుట్టిస్తున్న ఎండలు

రాష్ట్రంలో దడ పుట్టిస్తున్న ఎండలు
  • 7 జిల్లాల్లో 44 డిగ్రీల టెంపరేచర్లు
  • రాష్ట్రంలో దడ పుట్టిస్తున్న ఎండలు
  • నిర్మల్‌‌‌‌ జిల్లా దస్తూరాబాద్‌‌‌‌లో అత్యధికంగా 44.8 డిగ్రీలు 
  • 18 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు
  • మరో మూడు రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక
  • రాష్ట్రంలో దడ పుట్టిస్తున్న ఎండలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు దడ పుట్టిస్తున్నయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. మే నెల ప్రారంభం కాకముందే మండిపోతున్నాయి. ఓ వైపు కొన్ని చోట్ల మొగులు కమ్ముతున్నా.. ఇంకోవైపు సూర్యుడు సెగలుగక్కుతున్నాడు. పలుచోట్ల ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటున్నా రేడియేషన్ (ఎండ మంట) ఎక్కువగా ఉంటున్నది. ఆదివారం పలు జిల్లాల్లో టెంపరేచర్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 18 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. 7 జిల్లాల్లోని పలు చోట్ల 44 డిగ్రీలకు పైనే రికార్డయ్యాయి. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూర్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జంబుగల్లో 44.7, పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కళ్లపల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 44.4, జగిత్యాల జిల్లా గోదూరులో 44.3, సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 44, ఆదిలాబాద్ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 43.6, ఆదిలాబాద్ జిల్లా అర్లిటి, మంచిర్యాల జిల్లా కొండాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సైదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 39.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. వచ్చే మూడ్రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగే అవకాశమున్నట్టు పేర్కొంది. ఆ తర్వాతి మూడ్రోజులు తేలికపాటి జల్లులు కురవొచ్చని అంచనా వేసింది. మరోవైపు రంగారెడ్డి, నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

రేడియేషన్ ఎక్కువ..

రాష్ట్రంలోని పలు చోట్ల టెంపరేచర్లు 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నా.. ఆయా ప్రాంతాల్లో ఎండ మంట తీవ్రత చాలా ఎక్కువగా ఉంటున్నది. ఇందుకు ఆకాశంలో ఓజోన్ పొర కరుగుతుండడంతో సూర్యుడి నుంచి వెలువడే యూవీ (అతినీల లోహిత) కిరణాలు భూమిపైకి చేరుతుండటంతో రేడియేషన్ పెరుగుతున్నదని నిపుణులు చెప్తున్నారు. ఓజోన్ పొరకు పడిన రంధ్రం పూడుకుంటున్నా.. ఇది ఆశించినంత స్థాయిలో లేదని గతేడాది నాసా అధ్యయనంలో తేలింది. అలాగే, కాలుష్యం పెరిగి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు ఎక్కువవుతుండటం కూడా వేడి పెరగడానికి మరో కారణంగా చెబుతున్నారు. వాతావరణంలో కాలుష్యం స్థాయిలు ఎంత ఎక్కువైతే వేడిని అంత ఎక్కువగా కార్బన్​డయాక్సైడ్ అబ్సార్బ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎండ తీవ్రత తక్కువుగా ఉన్న.. ఎండ మంట ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు, 8 జిల్లాల్లో ఉక్కపోత అధికంగా ఉంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా నమోదవుతున్నది. అత్యధికంగా మెదక్ జిల్లా శివంపేటలో గాలిలో తేమ 100% రికార్డయింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ 60 శాతానికిపైగానే హ్యుమిడిటీ లెవెల్స్ రికార్డయ్యాయి.