నీట్‌‌‌‌ రీఎగ్జామ్..జూన్ 30 వరకు టెలిగ్రాంపై బ్యాన్  

నీట్‌‌‌‌ రీఎగ్జామ్..జూన్ 30 వరకు  టెలిగ్రాంపై బ్యాన్  
  •     మెసేజింగ్​ యాప్‌‌‌‌పై ఈ నెల 22 వరకు ఆంక్షలు
  •     కేంద్రం సంచలన నిర్ణయం.. ఎన్టీఏ హర్షం
  •     మెసేజింగ్​ యాప్‌‌‌‌‌‌‌‌పై ఈ నెల 22 వరకు ఆంక్షలు విధించిన కేంద్రం
  •     ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ఎన్టీఏ

న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్-యూజీ 2026’ రీ-ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌కు ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. పరీక్షల్లో అక్రమాలకు, నకిలీ పేపర్ లీకేజీల ప్రచారానికి అడ్డాగా మారిన ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’పై దేశవ్యాప్తంగా తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 21న జరగబోయే నీట్ రీ-టెస్ట్‌‌‌‌‌‌‌‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు.. నేషనల్ టెస్టింగ్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇచ్చిన సిఫార్సుల మేరకు ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. దేశంలో జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్ సేవలపై తాత్కాలిక ఆంక్షలు కొనసాగుతాయి. దీంతోపాటు టెలిగ్రామ్‌‌‌‌‌‌‌‌లో అత్యంత వివాదాస్పదంగా మారిన ‘మెసేజ్ ఎడిటింగ్’ ఫీచర్‌‌‌‌‌‌‌‌ను కూడా జూన్ 30 వరకు నిలిపివేయాలని కేంద్రం సదరు సంస్థను ఆదేశించింది. టెలిగ్రామ్ ఎడిట్ ఫీచర్‌‌‌‌‌‌‌‌ను నేరగాళ్లు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఎన్టీఏ అధికారులు ఆధారాలతో సహా వివరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్టీఏ స్వాగతించింది. బ్యాన్ వల్ల టెలిగ్రామ్ వినియోగదారులకు జరుగుతున్న ఇబ్బంది పట్ల ఎన్టీఏ విచారం వ్యక్తం చేసింది. అయితే, పరీక్షల పవిత్రతను కాపాడటానికి ఇది అత్యవసరమైన చర్య అని పేర్కొన్నది. ఈ ఆంక్షల వల్ల కొత్త మెసేజ్‌‌‌‌‌‌‌‌లు పంపుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ యథాతథంగా జరుగుతుందని, విద్యార్థులు కేవలం ఎన్టీఏ అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు సూచించారు.

వాట్సాప్‌‌‌‌‌‌‌‌ను ఎందుకు వదిలేశారంటే..

టెలిగ్రామ్‌‌‌‌‌‌‌‌, వాట్సాప్‌‌‌‌‌‌‌‌.. ఈ రెండు యాప్‌‌‌‌‌‌‌‌లూ ఒకేలాంటి సేవలు అందిస్తున్నప్పటికీ, వాట్సాప్‌‌‌‌‌‌‌‌లో మొబైల్ నంబర్ కనిపించడం తప్పనిసరి. పైగా మెటా సంస్థ తన ఏఐ టూల్స్ ద్వారా అనుమానాస్పద గ్రూపుల ప్రవర్తనను నిరంతరం పర్యవేక్షిస్తూ చట్టవ్యతిరేక ఖాతాలను బ్లాక్ చేస్తుంది. భారత ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేసేందుకు వాట్సాప్‌‌‌‌‌‌‌‌కు దేశంలో కార్యాలయాలు, ప్రతినిధులు ఉన్నారు. కానీ, టెలిగ్రామ్‌‌‌‌‌‌‌‌కు భారత్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి అధికారిక కార్యాలయం లేకపోవడం, ప్రభుత్వ ఆదేశాలకు త్వరితగతిన స్పందించకపోవడం, సొంతంగా గ్రూపులను నియంత్రించకపోవడం వల్లే ప్రభుత్వం ఈ ఉక్కుపాదం మోపాల్సి వచ్చింది.