అప్పుల బాధతో  కౌలు రైతు సూసైడ్

అప్పుల బాధతో  కౌలు రైతు సూసైడ్

వీపనగండ్ల, వెలుగు : వనపర్తి జిల్లా వీపన గండ్ల మండలం గోవర్ధనగిరికి చెందిన కౌలు రైతు పిట్టల రమేశ్​(45)  అప్పుల బాధతో సూసైడ్​ చేసుకున్నాడు. అతడు మరో నలుగురు రైతులతో కలిసి మామిడి తోటలను కౌలుకు తీసుకున్నాడు. ఆశించినంత దిగు బడి రాకపోవడంతో అప్పులు పెరిగాయి.

ఫెర్టి లైజర్స్​ డబ్బులు కట్టాలని షాపు యజమాని అడగడంతో రమేశ్​ .. మామిడి తోటలకు వాడే పురుగుమందును తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్​కు రూ.5 లక్షల దాకా అప్పు ఉందని స్థానికులు తెలిపారు. రమేశ్​ భార్య రెండేళ్ల కిందటే చనిపోయింది. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.