గాజులరామారంలో తీవ్ర ఉద్రిక్తత.. హైడ్రా జేసీబీలపై స్థానికుల రాళ్ల దాడి

గాజులరామారంలో తీవ్ర ఉద్రిక్తత.. హైడ్రా జేసీబీలపై స్థానికుల రాళ్ల దాడి

హైదరాబాద్ శివారు గాజులరామారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హబీబ్ బస్తీ, బాలయ్య నగర్, గాలిపోచమ్మ బస్తీ, సాయిబాబా బస్తీలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులకు ఆందోళనకు దిగారు. హబీబ్ బస్తీలో మరింత రెచ్చిపోయిన స్థానికులు కూల్చివేతలు జరుపుతున్న అధికారులు, జేసీబీలపై రాళ్లతో దాడి చేశారు. స్థానికుల రాళ్ల దాడిలో హైడ్రా జేసీబీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. కొందరు పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు. 

రాళ్ల దాడి చేసిన వారిలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు, అధికారులతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ పరిణామంతో గాజులరామారంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు స్థానికులు తమ ఇండ్లు కూలగొట్టదని అధికారులను వేడుకుంటున్నారు. ఇవాళ బతుకమ్మ పండగ కాదు మా శవాల పండగ అని.. పండగరోజు పండగ లేకుండా చేసారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా, ఆదివారం (సెప్టెంబర్ 18) కుత్బుల్లాపూర్ లోని గాజులరామా రంలో బిగ్ ఆపరేషన్ చేపట్టింది. అక్రమ నిర్మాణాలు, కబ్జాలు చేసి కట్టిన నిర్మాణాలను అధికారులు కూల్చి వేస్తున్నారు. ఇక్కడ దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ స్థలాన్నికబ్జాదారులు ఆక్రమించారు. 60 నుంచి 70 గజాల్లో ఇండ్లను నిర్మించిరూ.10 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై స్థానికులుహైడ్రాకు ఫిర్యాదు ఏశారు. 

దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆక్రమణదారుల చేతుల్లో సుమారు రూ.15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించారు. కబ్జాలను నిర్ధారించుకుని ఆదివారం (సెప్టెంబర్ 21) ఉదయం నుంచి తొలగింపు పనులు చేపట్టారు. నివాసాల జోలికి వెళ్లకుండా సర్వేనంబర్ 397లో 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో నిర్మించిన అక్రమ ఇండ్లను కూల్చివేస్తు న్నారు. అనంతరం దానికి కంచె వేయనున్నారు. కబ్జదారుల్లో కొందరు రాజకీయ నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.