హైదరాబాద్ హబ్సిగూడలో.. ఐదంతస్థుల బిల్డింగ్ పై నుంచి దూకిన టెన్త్ విద్యార్థిని

హైదరాబాద్ హబ్సిగూడలో.. ఐదంతస్థుల బిల్డింగ్ పై నుంచి దూకిన  టెన్త్  విద్యార్థిని

హైదరాబాద్ హబ్సీగూడలో దారుణ జరిగింది. ఓ విద్యార్తిని ఆత్మహత్యకు పాల్పడింది.  ఓ ప్రైవేట స్కూల్ లో   పదో తరగతి చదువుతోన్న  విద్యార్థిని  శ్రీ  వైష్ణవి నవంబర్ 25న ఉదయం  ఐదో అంతస్తు బిల్డింగ్ పైనుంచి  దూకి ఆత్మహత్య  చేసుకుంది.  ఈ ఘటనలో విద్యార్థిని శ్రీ వైష్ణవి అక్కడికక్కడే చనిపోయింది. 

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం  గాంధీ హాస్పిటల్ కి తరలించారు. విద్యార్థిని మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సరిగా చదవడం లేదని..మార్కులు తక్కువచ్చాయని తల్లిదండ్రులు మందలిండచంతో  మనస్థాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.