- తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు గోపాల్ రెడ్డికే బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎ. గోపాల్ రెడ్డి పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జస్టిస్ గోపాల్ రెడ్డి ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. రాష్ట్రంలోని ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల నిర్ణయ ప్రక్రియలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
