ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటన టీమిండియా పేసర్ టి.నటరాజన్‌కు ఓ కలగా సాగుతోంది. నెట్ బౌలర్‌గా కంగారూ టూర్‌కు వచ్చిన ఈ లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్.. మూడు ఫార్మాట్లలోనూ ఆడాకే తిరిగి భారత్ చేరుకునేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే వన్డే, టీ20ల్లో తన సత్తా చాటిన నట్టూ.. ఉమేశ్ యాదవ్‌కు గాయమవ్వడంతో టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. చివరి రెండు మ్యాచుల్లో తుది జట్టులో అతడికి బెర్త్ దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. నట్టూ టెస్ట్ ఎంట్రీపై అతడి కోచ్, తమిళనాడు హెడ్ కోచ్ దివాకర్ వాసు స్పందించాడు. లిమిటెడ్ ఓవర్లలో మాదిరిగా టెస్టుల్లో రాణించడం అంత సులువు కాదని, నట్టూ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందన్నాడు.
‘నటరాజన్ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నా. అతడు టెస్టుల్లోనూ ఆడాలని, రాణించాలని కోరుకుంటున్నా. అయితే అతడు వెంటనే సక్సెస్ అవుతాడమని మాత్రం చెప్పలేను. నట్టూ చాలా నేర్చుకోవాల్సి ఉంది. అతడు త్వరగా నేర్చుకోగలడు కూడా. ఒకవేళ టెస్టులకు అతడు సిద్ధంగా ఉన్నట్లు భావిస్తే ఆడించాలి. వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు నట్టూ రెడీగా ఉండాలి. టెస్టు క్రికెట్ అంత సులువు కాదు. ఒకే లైన్‌లో నిలకడగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. బాల్‌ను కట్ చేయడంతోపాటు స్వింగ్ చేయడం నేర్చుకోవాలి. టెస్టుల్లో స్లోబాల్స్, యార్కర్లు పెద్దగా పని చేయవు. నట్టూ పేస్ (130 కి.మీ.లు)తో బౌన్సర్లు వేసినా వికెట్లు దక్కడం కష్టమే. అతడు స్వింగ్‌తోపాటు యాంగిల్స్ పై మరింత ఫోకస్ చేయాలి’ అని దివాకర్ వాసు పేర్కొన్నాడు.

