కేయూ క్యాంపస్, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీజీ ఎడ్‌సెట్-2026 మంగళవారం జరగనుంది. ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్‌గా ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ ఎగ్జామ్‌కు అధికారులు నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా ఎగ్జామ్ హాలులోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 35,600 మంది అభ్యర్థులు టీజీ ఎడ్‌సెట్‌కు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 29,441 మంది అమ్మాయిలు, 6,155 మంది అబ్బాయిలు, నలుగురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. ఆన్‌లైన్‌లో టెస్ట్ నిర్వహించనుండగా రాష్ట్రవ్యాప్తంగా 16 జోనల్ టెస్ట్ సెంటర్లతో పాటు 59 సెంటర్లు ఏర్పాటు చేశారు.
