హైదరాబాద్, వెలుగు: టీజీ లాసెట్, పీజీఎల్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు జులై 5 నుంచి 10 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని, సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్‌సీసీ, క్యాప్, పీహెచ్, స్పోర్ట్స్ కేటగిరీల అభ్యర్థులకు జులై 6 నుంచి 9 వరకు ఓయూలోని అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. జులై 16 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జులై 24న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని, సీట్లు పొందిన వారు అదే నెల 25 నుంచి 28 మధ్య సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ జులై 27 నుంచి ప్రారంభం కానుంది.
