- ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్స్
- జనవరి 21, 22 తేదీల్లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్
- ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య శుక్రవారం షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్లకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి17 వరకు, సెకండియర్ స్టూడెంట్లకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి18 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ ను గతంతో రాయని వాళ్లు, ఫెయిల్ అయిన వాళ్లకు జనవరి 23న ఆ పరీక్షను నిర్వహిస్తామని చెప్పారు. 24న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ జరగనుందని వివరించారు. ఈ పరీక్ష ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని తెలిపారు.
ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్స్
ఇంటర్ ప్రాక్టికల్పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ఉంటాయని కృష్ణ ఆదిత్య వెల్లడించారు. వీటిని ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ప్రాక్టికల్స్ ఆదివారం కూడా ఉంటాయని వివరించారు. మరోపక్క ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ జనవరి 21న, సెకండియర్ విద్యార్థులకు జనవరి 22న ఉంటాయన్నారు. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్, ప్రాక్టికల్స్ ఒకే రోజు వస్తే.. ఆ అభ్యర్థులకు ప్రత్యామ్నాయ తేదీల్లో అవకాశం కల్పించనున్నట్టు వివరించారు.
నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్ ఫీజు ఫైన్ లేకుండా 13 వరకు చెల్లించే ఛాన్స్
ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు నేటి నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఎలాంటి ఫైన్ లేకుండా నవంబర్14 వరకు ఫీజు కట్టుకోవచ్చని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. రూ.వంద ఫైన్‌తో ఈ నెల16 నుంచి 24 వరకు, రూ.500 ఫైన్‌తో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 1 వరకు, రూ.వెయ్యి ఫైన్‌తో డిసెంబర్ 3 నుంచి 8 వరకు, రూ.2 వేల ఫైన్‌తో డిసెంబర్ 10 నుంచి 15 వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించారు. కాగా, ఫస్టియర్, సెకండియర్ జనరల్ రెగ్యులర్ విద్యార్థులకు రూ.530 ఫీజు ఉంటుందని, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ కు మరో రూ.వంద ఫీజు ఉంటుందని తెలిపారు. ఒకేషనల్ ఫస్టియర్, సెకండియర్ స్టూడెంట్లకు రూ.870 ఫీజు ఉంటుందని చెప్పారు. సెకండియర్ జనరల్ సైన్స్ విద్యార్థులకు మొత్తం రూ.870 ఫీజు ఉండనున్నది.
ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్
తేదీ పేపర్
ఫిబ్రవరి 25 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
ఫిబ్రవరి 27 ఇంగ్లిష్ పేపర్ 1
మార్చి 02 మ్యాథ్స్ 1ఏ, బాటనీ-1,
పొలిటికల్ సైన్స్ పేపర్-1
మార్చి 05 మ్యాథ్స్1బీ, జువాలజీ-1,
హిస్టరీ పేపర్-1
మార్చి 09 ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్-1
మార్చి 12 కెమిస్ట్రీ, కామర్స్ పేపర్-1
మార్చి 14 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్
మ్యాథ్స్ (బైపీసీ) పేపర్-1
మార్చి 17 జాగ్రఫీ-1, మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1
సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్
ఫిబ్రవరి 26 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
ఫిబ్రవరి 28 ఇంగ్లిష్ పేపర్ 2
మార్చి 03 మ్యాథ్స్ 2ఏ, బాటనీ-2,
పొలిటికల్ సైన్స్ పేపర్-2
మార్చి 06 మ్యాథ్స్ 2బీ, జువాలజీ-2,
హిస్టరీ పేపర్-2
మార్చి 10 ఫిజిక్స్-2, ఎకనామిక్స్ పేపర్-2
మార్చి 13 కెమిస్ట్రీ-2, కామర్స్ పేపర్-2
మార్చి 16 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,
బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ (బైపీసీ) పేపర్-2
మార్చి 18 జాగ్రఫీ-2, మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -2
