చైల్డ్ పోర్న్ గ్రఫీపై టీజీసీఎస్ బీ ఫోకస్..చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తే జైలుకే

చైల్డ్ పోర్న్ గ్రఫీపై టీజీసీఎస్ బీ ఫోకస్..చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తే జైలుకే
  • ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో చిన్నారుల అశ్లీల వీడియోలు వెతికితే పాప్‌‌‌‌‌‌‌‌ అప్స్‌‌‌‌‌‌‌‌ అలర్ట్
  • అసభ్య వీడియోలు, ఫొటోలు అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసినా.. చూసినా ట్రేస్‌‌‌‌‌‌‌‌
  • ఇంటర్నెట్ ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌పై అమెరికా నుంచి సైబర్ టిప్​లైన్‌‌‌‌‌‌‌‌
  • సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చేరిన 97,556 టిప్‌‌‌‌‌‌‌‌లైన్స్
  • 854 ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నమోదు చేసిన సీఎస్‌‌‌‌‌‌‌‌బీ.. 376 మంది అరెస్ట్‌‌‌‌‌‌‌‌

చైల్డ్ పోర్నో గ్రఫీపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీ సీఎస్‌‌బీ) స్పెషల్ ఫోకస్‌‌ పెట్టింది. ఆన్‌‌లైన్‌‌లో చిన్నారుల అశ్లీల వీడియోలు బ్రౌజింగ్​ చేసినా, డౌన్‌‌లోడ్‌‌ చేసి స్టోర్ చేసుకోవడంతో పాటు ఇతరులకు షేర్ చేసినా ట్రేస్‌‌ చేసి పట్టుకుంటున్నది. 

హైదరాబాద్, వెలుగు:చైల్డ్ పోర్నో గ్రఫీపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీ సీఎస్‌‌‌‌‌‌‌‌బీ) స్పెషల్ ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో చిన్నారుల అశ్లీల వీడియోలు బ్రౌసింగ్‌‌‌‌‌‌‌‌ చేసినా, డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసి స్టోర్ చేసుకోవడంతో పాటు ఇతరులకు షేర్ చేసినా ట్రేస్‌‌‌‌‌‌‌‌ చేసి పట్టుకుంటున్నది. ఇందుకు సంబంధించి గత ఏడాది 854 కేసులు నమోదు చేసి.. 376 మందిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. 1,635 అనుమానితుల ప్రొఫైల్స్‌‌‌‌‌‌‌‌ను రూపొందించి, మానిటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. 

ప్రపంచ వ్యాప్తంగా చైల్డ్‌‌‌‌‌‌‌‌ పోర్నో గ్రఫీపై నిషేధం అమలులో ఉంది. ఈ మేరకు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ఆఫ్‌‌‌‌‌‌‌‌ మిస్సింగ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్లోయిటెడ్‌‌‌‌‌‌‌‌ చిల్డ్రన్‌‌‌‌‌‌‌‌(ఎన్‌‌‌‌‌‌‌‌సీఎమ్‌‌‌‌‌‌‌‌ఈసీ) సంస్థతో నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌బ్యూరో (ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ) 2019 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌26న అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ చేసుకుంది. అప్పటి నుంచి దేశంలో చైల్డ్‌‌‌‌‌‌‌‌ పోర్నో గ్రఫీ చూస్తున్న వారిని గుర్తించి దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేస్తున్నది.

చైల్డ్‌‌‌‌‌‌‌‌ పోర్న్‌‌‌‌‌‌‌‌ బ్రౌస్‌‌‌‌‌‌‌‌ చేస్తే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అలర్ట్స్‌‌‌‌‌‌‌‌

అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఎన్‌‌‌‌‌‌‌‌సీఎమ్‌‌‌‌‌‌‌‌ఈసీ.. చిన్నారుల భద్రతపై ప్రపంచ వ్యాప్తంగా నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసింది. మిస్సింగ్  చిన్నారులతో పాటు లైంగిక దాడులను అరికట్టే విధంగా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ సమాచారం సేకరిస్తోంది. ఇందులో భాగంగా.. చిన్నారుల అశ్లీల ఫొటోలు, వీడియోలు గుర్తించేందుకు ‘సైబర్ టిప్‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌’ ఏర్పాటు చేసింది. 

చిన్నారుల అశ్లీల చిత్రాలను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసే వారితో పాటు వాటిని బ్రౌస్ చేసి చూసే వారి ఐపీ(ఇంటర్నెట్ ప్రోటోకాల్‌‌‌‌‌‌‌‌) అడ్రెస్‌‌‌‌‌‌‌‌లను సైబర్ టిప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గుర్తించి దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేస్తోంది. చైల్డ్‌‌‌‌‌‌‌‌ అబ్యూస్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన కంటెంట్‌‌‌‌‌‌‌‌తో ఎలాంటి బ్రౌసింగ్‌‌‌‌‌‌‌‌ చేసినా పాప్‌‌‌‌‌‌‌‌ అప్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా గుర్తించి ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌తో లింకు అయిన మొబైల్‌‌‌‌‌‌‌‌ ఫోన్లు, ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌, డెస్క్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌ ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌‌‌‌‌‌‌‌నైనా సరే ట్రాక్ చేస్తున్నది. 

ఈ డేటాను సైబర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌టిప్‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఐపీ అడ్రెస్‌‌‌‌‌‌‌‌ల ఆధారంగా ఆయా దేశాల విదేశాంగ శాఖ, హోంశాఖల ద్వారా సంబంధిత రాష్ట్రాల క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు(సీఐడీ) లేదా సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు చేరవేస్తున్నారు.

97,556 సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టిప్‌‌‌‌‌‌‌‌ లైన్స్‌‌‌‌‌‌‌‌, 376 మంది అరెస్ట్‌‌‌‌‌‌‌‌

రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు గతేడాది మొత్తం 97,556  సైబర్ టిప్‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌ అలర్ట్స్‌‌‌‌‌‌‌‌ వచ్చాయి. వీటిని సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన చైల్డ్‌‌‌‌‌‌‌‌ సెక్సువల్‌‌‌‌‌‌‌‌ అబ్యూస్ మెటీరియల్‌‌‌‌‌‌‌‌(సీఎస్‌‌‌‌‌‌‌‌ఈఏఎం) విభాగం పరిశీలించింది. టిప్‌‌‌‌‌‌‌‌లైన్ అందించిన ఐపీ అడ్రెస్‌‌‌‌‌‌‌‌ల ఆధారంగా  సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తు చేస్తున్నది. 

1,635 అనుమానితుల ప్రొఫైల్స్ రూపొందించింది. ఈ మేరకు 2025లో నవంబర్ వరకు 854 ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రిజిస్టర్ చేసింది. చిన్నారుల అశ్లీల వీడియోలు బ్రౌస్‌‌‌‌‌‌‌‌ చేసిన వారిని గుర్తించింది. 376 మందిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. పలువురికి కౌన్సిలింగ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో పాటు కోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేసింది.

 ఇలాంటి డెటాతో స్థానిక పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా చిన్నారులకు సంబంధించి అశ్లీల వీడియోలు బ్రౌజ్‌‌‌‌‌‌‌‌ చేసినా,చూసినా, అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసినా వెంటనే గుర్తించి అలర్ట్స్‌‌‌‌‌‌‌‌ వచ్చేలా అధికారులు ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు.