- సుమారు 700 గ్రాముల ఆభరణాలు మాయం
- పరారీలో అసిస్టెంట్ మేనేజర్
మహబూబాబాద్, వెలుగు : లోన్ల కోసం కస్టమర్లు బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని అసిస్టెంట్ మేనేజర్ కాజేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంక్ లో జరిగిన ఘటన గురువారం వెలుగుచూసింది. మహబూబాబాద్ టౌన్ సీఐ రఘుపతి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక ఇండియన్ బ్యాంక్ లో ఆఫీసర్లు నెలవారీ ఆడిట్ నిర్వహించారు.
ఈ సమయంలో 22 మంది కస్టమర్లకు చెందిన సుమారు 700 గ్రాముల ఆభరణాలు కనిపించలేదు. దీంతో బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు, ఆఫీసర్ల విచారణలో అసిస్టెంట్ మేనేజర్ భుక్యా రాజేశ్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, మాయం అయిన ఆభరణాల విలువ సుమారు రూ. 91 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బ్యాంక్లో గోల్డ్మాయమైనట్లు తెలియడంతో కస్టమర్లు భారీ సంఖ్యలో బ్యాంక్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగగా.. కస్టమర్లు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆఫీసర్లు సూచించారు.
