గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రయారిటీ: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రయారిటీ: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పాలకవీడు, వెలుగు : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, అన్ని గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  తెలిపారు. పాలకవీడు మండలంలోని మూసి ఒడ్డు సింగారం నుంచి రాళ్లవారిగూడెం వరకు రూ.1.8 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ఆదివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన రహదారి అందుబాటులోకి రావడంతో ప్రజలకు రాకపోకలు సులభతరమవుతాయన్నారు. గ్రామంలోని విద్యుత్  లో వోల్టేజి సమస్యను గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్, ఎస్పీ నర్సింలు, మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.