పెండింగ్ సమస్యల పరిష్కారానికి  ఉద్యోగుల ఆందోళన బాట

పెండింగ్ సమస్యల పరిష్కారానికి  ఉద్యోగుల ఆందోళన బాట
  • 17న రాష్ట్రవ్యాప్తంగా నిరసన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టనుంది. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని నిర్ణయించింది. శుక్రవారం ఉద్యోగుల జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ మారం జగదీశ్వర్, ఏలూరు శ్రీనివాస్ రావు సెక్రటరియేట్ లో సీఎస్ రామకృష్ణ రావును కలిసి వినతిపత్రం అందజేశారు.

17న 33 జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ సిటీ, సెక్రటేరియట్‌‌తో పాటు అన్ని మండల, డివిజన్ కార్యాలయాల్లో  వినతిపత్రాలు అందజేయనున్నారు. 51% ఫిట్‌‌మెంట్‌‌ తో జూన్ 2లోపు నివేదికను తెప్పించి అమలు చేయాలని, సుమారు రూ.13వేల కోట్ల పెండింగ్​ బిల్లులను విడుదల  తదితర డిమాండ్లను నెరవేర్చాలని చైర్మన్, సెక్రటరీ జనరల్ డిమాండ్ చేశారు. సీఎస్ ను కలిసిన వారిలో దామోదర్ రెడ్డి, శ్యామ్, సదానందం గౌడ్,  రమేశ్ ఉన్నారు.