
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీఆర్జేసీ పరీక్ష ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్నట్టు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శ సీహెచ్. రమణ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.2025–-26 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం(ఇంగ్లిష్ మీడియం) ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో 35 తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్ టికెట్లను http://tgrjc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని పరీక్షకు ఒక్క రోజు ముందుగానే వెళ్లి చూసుకోవాలని సూచించారు. ఈ నెల10న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష ఉండగా ఒక గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు.