కింగ్ ఆట మొదలెట్టేశాడు: ఐపీఎల్ కోసం లార్డ్స్‌‌‌‌‌‌‌‌లో కోహ్లీ ప్రాక్టీస్

కింగ్ ఆట మొదలెట్టేశాడు: ఐపీఎల్ కోసం లార్డ్స్‌‌‌‌‌‌‌‌లో కోహ్లీ ప్రాక్టీస్

లండన్: ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కొత్త సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం రెడీ అవుతున్నాడు. 19వ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉన్న తరుణంలో కోహ్లీ లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఇండోర్ ఫెసిలిటీలో నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా అది వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. 

ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నివసిస్తున్న కోహ్లీ లార్డ్స్ స్టేడియంలో కఠినమైన ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటున్నాడు. జనవరి 18న ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత కోహ్లీ తిరిగి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే కాంపిటేటివ్ క్రికెట్ ఆడనున్నాడు. గతేడాది ట్రోఫీ నెగ్గిన బెంగళూరు మెగా లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలిసారి చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. ఇప్పుడు సీఎస్కే, ముంబై ఇండియన్స్ తర్వాత వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన మూడో జట్టుగా రికార్డు సృష్టించాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది.