సచివాలయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్

సచివాలయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం అధికారికంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే.. టీవీకే అధినేత విజయ్ సచివాలయానికి వెళ్లారు.  చెన్నైలోని సెక్రటేరియట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి విజయ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా పలువురు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్‌లో ముఖ్యమంత్రిగా ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే కీలక ఫైళ్లపై సంతకాలు చేస్తూ పాలనలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.

విజయ్ మామ అండగా ఉంటాడు

నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణస్వీకాం అనంతరం మాట్లాడిన విజయ్  రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విజయ్ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు .. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని, ప్రస్తుతం రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తానని, తన పాలన పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏది సాధ్యమైతే అదే చెబుతాను.. చెప్పిందే చేస్తాను. ప్రజాధనాన్ని వృథా చేయను, ఎవరినీ దోచుకోనివ్వను. నా ప్రభుత్వంలో నేనే పవర్ సెంటర్.. రెండో పవర్ సెంటర్‌కు తావు లేదు. పార్టీ కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా.. కార్యకర్తలు అహంకార ధోరణిని వీడం. విద్యార్థులకు విజయ్ మామ ఉన్నాడు.. మైనార్టీలకు నేను అండగా ఉంటాను  అంటూ భరోసా ఇచ్చిన  విజయ్.. తనకు మద్దతు తెలిపిన మిత్రపక్షాలకు, కాంగ్రెస్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

విజయ్ సంచలన నిర్ణయాలు 

  • తొలి సంతకం: పేదలకు ఊరటనిస్తూ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంపై సంతకం చేశారు.
  • రెండో సంతకం: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ.. షీ టీమ్స్ తరహాలో ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
  • మూడో సంతకం: రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.