Varasudu : ‘వారసుడు’ ట్రైలర్‌ వచ్చేసింది

Varasudu :  ‘వారసుడు’ ట్రైలర్‌ వచ్చేసింది

తమిళ నటుడు విజయ్‌ హీరోగా టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరక్షన్ లో  తెరకెక్కుతోన్న చిత్రం ‘వారిసు’ (తెలుగులో వారసుడు).  చిత్ర తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముందుగా సాయంత్రం 5 గంటలకు తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఇది యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని  శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి,పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.  

ఇందులో విజయ్ సరసన రష్మి్క మందన హీరోయిన్ గా నటిస్తోంది. జయసుధ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, సంగీత కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చాయి.  భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని ఈ నెల 12 న రిలీజ్ చేయనున్నారు.