ఇంగ్లండ్ కు కరువు ముప్పు ...!

ఇంగ్లండ్ కు కరువు ముప్పు ...!

వాతావరణ మార్పులు యూరప్ ను అతలాకుతలం చేస్తున్నాయి. ఎండ వేడిమికి పలు దేశాల్లో కరువు ముంచుకొస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, హంగేరి, సెర్బియా, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ లాంటి యూరప్ దేశాలు ప్రమాదపుటంచున ఉన్నాయి. కాగా దక్షిణ ఇంగ్లండ్‌లోని థేమ్స్‌ నదిలో ఏకంగా 356 కి.మీ. మేర ఇసుక మేటలు వేసింది. వానలు కురవకపోవడం, ఎగువ నుంచి నీళ్లు రాకపోవడంతో ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది. ఎక్కడా కూడా నీటి ఆనవాళ్లు లేకుండా ఎడారిని తలపిస్తోంది. 1935 తర్వాత ఎన్నడూ లేనివిధంగా గత నెలలో లండన్ లో నమోదైన విపరీతమైన ఉష్ణోగ్రతల నేపథ్యంలో యూకే ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించింది. అంతే కాదు ఈ పరిణామాల వల్ల రైళ్లు కూడా నిలిచిపోయాయి.

ముఖ్యంగా ఎంతో ప్రాముఖ్యమైందిగా చెప్పుకునే థేమ్స్ నది ఎండిపోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఇంగ్లండ్ లో కరువు వచ్చే పరిస్థితి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జులై నెలలో అక్కడ అత్యంత పొడి వాతావరణం ఏర్పడింది. దీంతో సగటు వర్షపాతం 23.1 మిల్లీ మీటర్లు నమోదైంది. ఇంకో ముఖ్య విషయమేమింటే దాదాపు 1.5 కోట్ల జనాభా థేమ్స్ నదిపై ఆధారపడి ఉన్నారు.