
అభిమానులకు అందుబాటులో ఉంటూ మనసులోని మాటల్ని, తమ సినిమాల అప్డేట్స్ని షేర్ చేసేందుకు దాదాపు స్టార్స్ అంతా వాడుతున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్.. ట్విటర్. లాక్‌డౌన్ టైమ్‌లో సినిమాల పరంగా అభిమానులకు దూరంగా ఉన్నప్పటికీ, ట్విటర్ ద్వారా మాత్రం టచ్‌లోనే ఉన్నారు మన స్టార్స్. దీంతో సౌత్ ఇండియన్ ట్విటర్ రికార్డుల్లో మన హీరోలు సత్తా చాటారు. మోస్ట్ ట్వీటెడ్ సౌత్ ఇండియన్ హీరోల లిస్టుని ట్విటర్ సోమవారం రిలీజ్ చేసింది. ఇందులో మహేష్ బాబు నంబర్ వన్‌గా నిలిచాడు. లాక్ డౌన్ తర్వాత ట్విటర్లో ఎక్కువ యాక్టివ్ అయ్యాడు మహేష్. తరచుగా తన ఫ్యామిలీ ఫొటోస్ పోస్ట్ చేయడం నుంచి ఇతర సెలెబ్రిటీలకి బర్త్ డే విషెస్ చెప్పడం వరకు ట్విటర్‌ని బాగా వాడుతున్నాడు. దాంతో తన ఫాలోవర్స్ సంఖ్య పది మిలియన్లు దాటేయడమే కాదు.. మోస్ట్ ట్వీటెడ్ హీరోగా ఫస్ట్ ప్లేస్‌లో కూడా నిలబడ్డాడు. తర్వాతి స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు.
ఆ తర్వాతి మూడు స్థానాల్లో కోలీవుడ్ హీరో విజయ్, ఎన్టీఆర్, సూర్య నిలిచారు. ఆరో స్థానంలో అల్లు అర్జున్, సెవెన్త్ ప్లేస్‌లో రామ్ చరణ్ ఉంటే.. నెక్స్ట్ ప్లేస్‌లో ధనుష్ ఉన్నాడు. తొమ్మిదో స్థానాన్ని మోహన్‌లాల్ సొంతం చేసుకుంటే.. కొంత ఆలస్యంగా సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చినప్పటికీ యాక్టివ్‌గా ఉంటున్న చిరంజీవి పదో స్థానంలో నిలిచారు. జనవరి 1 నుండి నవంబర్ 15 వరకు గల డేటా ఆధారంగా ఈ లిస్ట్‌ని రిలీజ్ చేసింది ట్విటర్. ఇక హీరోయిన్స్‌లో టాప్ ప్లేస్‌లో కీర్తి సురేష్, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కాజల్, సమంత, రష్మిక, పూజా హెగ్డే, తాప్సీ, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, శ్రుతీహాసన్, త్రిష నిలిచారు. మోస్ట్ ట్వీటెడ్ మూవీగా విజయ్ ‘మాస్టర్’, సెకెండ్ ప్లేస్‌లో పవన్ ‘వకీల్ సాబ్’, తర్వాతి స్థానాల్లో వలిమై, సర్కారు వారి పాట, సూరారై పోట్రు, ఆర్ఆర్ఆర్, పుష్ప, సరిలేరు నీకెవ్వరు, కేజీఎఫ్ 2, దర్బార్ నిలిచాయి.