
జనగామ, వెలుగు : జనగామ ఎమ్మెల్యే టికెట్ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇవ్వొద్దని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఇస్తే గెలిపించుకుంటామని ఓ ఆడియో సోషల్‌మీడియాలో వైరల్అవుతోంది. నర్మెట మండలంలో సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఈ మేరకు చర్చ జరిగినట్లు గులాబీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. పంద్రాగస్టు సందర్భంగా సరదాగా శ్రీశైలం టూర్ వెళ్లేందుకు సమావేశం ఏర్పాటు చేసుకోగా అక్కడికి స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన ఇద్దరు పల్లా అనుచరులు రాగా వారికి సర్పంచులు తేల్చి చెప్పినట్లు ఆడియోలో ఉంది. అంతకుముందు సదరు సర్పంచులు, లీడర్లు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత మరో చోట జరిగిన మీటింగ్‌లోనూ జనగామ టికెట్గురించే చర్చ జరిగింది. ‘పోచంపల్లికి టికెట్ఇచ్చినా ఓకే.. లేదంటే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ఇచ్చినా గెలిపించుకుంటాం.. కానీ, పల్లా రాజేశ్వర్ రెడ్డికి వద్దు’ అని అన్నట్లు ఉన్న ఆడియోను ముత్తిరెడ్డి అనుచరులు వైరల్ చేస్తున్నారు.