మూసీ ప్రాజెక్టుకు గండి కొట్టిన అధికారులు

మూసీ ప్రాజెక్టుకు గండి కొట్టిన అధికారులు

భారీ వర్షాలు నల్లగొండ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. వరద నీటితో మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గరిష్ట స్థాయికి మించి ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది. దాంతో అధికారులు 13 గేట్లను 20 అడుగులు ఎత్తి నీటిని కిందికి విడుదలచేశారు.
అయినా కూడా నీటిమట్టం తగ్గకపోవడంతో ప్రాజెక్ట్ కట్టకు రత్నపురం గ్రామం వద్ద జేసీబీలతో అధికారులు గండి కొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని సూర్యపేట జిల్లా కలెక్టర్లు వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సూర్యపేట మరియు నల్లగొండ జిల్లాల కలెక్టర్లు వినయ్ కృష్ణారెడ్డి, ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రాజెక్ట్ వద్దే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రాజెక్ట్ కింది గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితిని తెలుసుకునేందుకు విద్యుత్ శాఖమంత్రి జగదీశ్ రెడ్డి మూసీకి వెళ్లనున్నారు.

For More News..

హైదరాబాద్ అలర్ట్.. ఇవ్వాళ, రేపు సెలవు

వీడియో: ఏనుగు మీద యోగా చేస్తూ కిందపడ్డ రామ్‌దేవ్ బాబా

లంచం కేసులో అరెస్టయిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య