బీజేపీ అహంకారాన్ని నేలకు దించారు : ఎంపీ వంశీకృష్ణ

బీజేపీ అహంకారాన్ని నేలకు దించారు : ఎంపీ వంశీకృష్ణ
  • ధర్మేంద్ర ప్రధాన్​ రాజీనామా యువతకు పెద్ద విజయం
  • కలిసికట్టుగా ఉద్యమిస్తే విజయం తథ్యమని జెన్‌‌‌‌‌‌‌‌జీ నిరూపించారు
  • ఇకనైనా బీజేపీ నేతలు, మంత్రులు ఒళ్లుదగ్గర పెట్టుకోవాలని సూచన

హైదరాబాద్, వెలుగు: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ రాజీనామా జెన్​జీ యువత సాధిం చిన పెద్ద విజయమని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ఇది దేశంలోని యువతకు పెద్ద శుభవార్త అన్నారు. ప్రధాన్​ రాజీనామా నేపథ్యంలో శనివారం సాయంత్రం ఎంపీ వీడియో సందేశం విడుదల చేశా రు.

యువత ఒక అంశంపై కలిసికట్టుగా ఉద్యమిస్తే సాధించలేనిది ఏదీ లేదని అందులో పేర్కొనారు. ఈ అనుభవంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇకపై ఒళ్లుదగ్గరపెట్టుకొని ప్రవర్తించాలని సూచించారు.  ‘‘కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీ నామా చేశారు. ఇది భారత దేశ యువతకు పెద్ద శుభవార్త.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత నెల రోజులుగా అహంకారంతో ప్రవర్తించింది. దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు రోడ్డెక్కి ఉద్యమించి వారి అహంకారాన్ని దించారు. మేం ఎన్నుకున్న నాయకులు మాకు న్యాయం చేయాలంటూ వారు చేసిన నిరసనలు, ధర్నాలకు ఫలితం దక్కింది.

యువత ఒక్కటిగా కంకణబద్ధులై ప్రయత్నిస్తే కచ్చితంగా విజయం సాధిస్తారని ధర్మేంద్ర ప్రధాన్ రాజీ నామాతో మరోసారి రుజువైంది. ఈ రాజీనామా దేశ యువతకు పెద్ద విజయం. దీని తర్వాత అయినా బీజేపీ నాయకులు మంత్రులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని భావిస్తున్నాం” అని ఎంపీ అన్నారు.