పాతింట్లో తల్లీ కొడుకుల డెడ్ బాడీలు.. కుళ్లిన స్థితిలో లభ్యం

పాతింట్లో తల్లీ కొడుకుల డెడ్ బాడీలు.. కుళ్లిన స్థితిలో లభ్యం
  • కోడలు పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య
  • పురుగుల మందు తాగినట్లు గుర్తింపు

తాండూరు, వెలుగు: తల్లీకొడుకుల మృతదేహాలు వారి పాతింట్లోనే కుళ్లిన స్థితిలో లభ్యమయ్యాయి. ఈ ఘటన తాండూరు మండలం ఐనెల్లి గ్రామ పంచాయతీ శివారులోని జింగుర్తి గేటు దగ్గర గల ఇంద్రారెడ్డి కాలనీలో చోటుచేసుకుంది.

ఇంద్రారెడ్డి కాలనీకి చెందిన కమ్మరి తుల్జమ్మ(46), శంకర్​దంపతులకు కుమారుడు నరేశ్(28) ఉన్నాడు. ఉపాధి నిమిత్తం కోటా బాస్ పల్లిలో ఉంటూ అక్కడే ఇల్లు కొనుగోలు చేశారు. నరేశ్ కు కర్నాటకలోని మిరియానంకు చెందిన మౌనికతో నాలుగేండ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక పాప ఉంది.

ఇద్దరి​ మధ్య తరచూ గొడవలు జరగడంతో మౌనిక తన బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన తుల్జమ్మ, ఆమె కొడుకు నరేశ్​10 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. బంధువులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు.

ఇంద్రారెడ్డి నగర్ లోని వారి పాతింట్లోనే తల్లీకొడుకుల మృతదేహాలు ఉన్నాయని మంగళవారం స్థానికుల ద్వారా తెలుసుకొని వెళ్లిచూశారు. ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని గుర్తించారు. మృతురాలి సోదరుడు రమేశ్​ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రవీణ్​కుమార్​రెడ్డి తెలిపారు.