కొలంబో: రోహిత్ యాదవ్ (4/49), చిగురుపాటి వెంకట (3/27) తడాఖా చూపెట్టడంతో.. శ్రీలంక అండర్–19తో జరిగిన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా అండర్–19 జట్టు 211 రన్స్ భారీ తేడాతో విజయం సాధించింది.
దాంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1–0తో సొంతం చేసుకుంది. 472 రన్స్ లక్ష్య ఛేదనలో 155/4 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం నాలుగో రోజు బరిలోకి దిగిన లంక రెండో ఇన్నింగ్స్‌లో 76.5 ఓవర్లలో 260 రన్స్‌కు ఆలౌటైంది. సెనుజా (64), విమిత్ దిన్సారా (64), సెత్మిక్ (42), కవిజా గమాగే (36) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు.
ఇన్నింగ్స్‌లో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ప్రణవ్ రాఘవేంద్ర, జెగనాథన్, యశబర్ధన్ చౌహాన్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
